న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలకు తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ వేయాలంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బంగారం వర్తకులు గళం విప్పుతున్నారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనెల 23న ఒక రోజు సమ్మెపాటించడానికి సిద్ధమవుతున్నారు.ఈ విషయాన్ని ఆలిండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జిజెసి) ప్రకటించింది. వీరు తీసుకున్న నిర్ణయానికి రత్నాలు, ఆభరణాల పరిశ్రమకు సంబంధించిన నాలుగు జోన్లలోని 350 సంఘాలు, సమాఖ్యలు మద్దతు ప్రకటించాయి. బంగారం స్వచ్ఛతకు గుర్తింపుగా హాల్ మార్కింగ్‌ను అమలు చేయాలని బులియన్ వ్యాపారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో నకిలీ బంగారు ఆభరణాలఅమ్మకాలను నియంత్రించడం కోసం కేంద్రం ఈ ఏడాది జూన్ 16న హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసింది. అయితే ఈ నిర్ణయం తమ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నందున తక్షణమే నిర్ణయంలో మార్పు చేయాలని జిజెసి డిమాండ్ చేస్తోంది. హాల్‌మార్క్ ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఏకపక్ష అమలుకు వ్యతిరేకంగా ఒక రోజు శాంతియుత నిరసన, సింబాలిక్ సమ్మె చేపడుతున్నట్లు జిజెసి మాజీ చైర్మన్ అశోక్ మీనావాలా తెలిపారు.
‘హాల్‌మార్క్’కు వ్యతిరేకంగా 23న ఒక రోజు సమ్మె
- Advertisement -
- Advertisement -
- Advertisement -