Monday, December 23, 2024

తెలంగాణలో ఏదో ఒకరోజు టిడిపికి పూర్వ వైభవం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఏదో ఒకరోజు తప్పకుండా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో తెదేపా అధికారంలో లేకపోయినా పార్టీ శ్రేణుల ఉత్సాహం బాగుందన్నారు. మరోసారి తనను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మంగళవారం తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చిన చంద్రబాబుకు రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పలువు సీనియర్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ శ్రేణులనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ఎన్టీఆర్, పివి నరసింహారావు దేశానికి దశ, దిశ చూపించారు. టిడిపి వచ్చిన తర్వాతే తెలుగువారి ప్రతిభ ప్రపంచానికి చాటి చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు.

తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలుస్తోందంటే టిడిపి వేసిన పునాదే కారణమన్నారు. తెలుగు వాళ్లు ప్రపంచం నలుమూలలా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఘనతేనన్నారు. ఆనాడు ఐటి అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇది సాధ్యమయ్యిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో అడుగడుగునా టిడిపి ముద్ర ఉందన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగువారి కోసం టిడిపి పనిచేస్తుందన్నారు. ప్రతి తెలుగువాడిని సంపన్నుడిని చేయడమే టిడిపి లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలోని వంద ప్రధాన నగరాల్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News