Saturday, November 2, 2024

‘హెరిటేజ్ హైదరాబాద్ వన్ డే టూర్’ పేరుతో

- Advertisement -
- Advertisement -

పర్యాటకుల కోసం ఐఆర్‌సిటిసి సరికొత్త ప్యాకేజీ
నగరంలోని ప్రముఖ ప్రాంతాల సందర్శన
ఒక్కరికీ రూ.505ల ధర
సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి ఈ ప్రయాణం ప్రారంభం

One day tour in Hyderabad

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో అనేక చారిత్రాత్మక కట్టడాలు, దేవాలయాలు, పార్కులు వంటి అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అయితే వీటిని చూడాలనుకునే వారి కోసం ఐఆర్‌సిటిసి సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచింది. ఈ ప్యాకేజీలో భాగంగా భాగ్యనగరంలోని ప్రముఖ ప్రదేశాలను చూడవచ్చు. ఈ ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ‘హెరిటేజ్ హైదరాబాద్ వన్ డే టూర్ ప్యాకేజీ’ పేరుతో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఒక ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ధర ఒక్కరికీ రూ.505 మాత్రమే. ఈ ప్యాకేజీ సోమవారం, శుక్రవారం తప్ప మిగతా ఐదు రోజులు అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకుంటే ఒక్క రోజులో భాగ్యనగరంలోని చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చు.

ఈ ప్యాకేజీ 4 నుంచి 6 మంది బుక్ చేసుకుంటే

ఈ టూర్ ప్యాకేజీ సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల దగ్గర ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటలకు టూర్ మొదలవుతుంది. ఈ టూర్‌లో భాగంగా ట్యాంక్‌బండ్, బిర్లా మందిర్, సాలార్‌జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీద్, చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్‌ను సందర్శించవచ్చు. టూర్ కంప్లీట్ అయిన తర్వాత రైల్వే స్టేషన్ వద్ద దింపుతారు.

టూర్ లో ఎసి వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, టోల్ ఛార్జీలు, పార్కింగ్ ఛార్జీలు ప్యాకేజీలో కవర్ అవుతాయి. అయితే వసతి, భోజన సదుపాయం, పర్యాటక ప్రాంతాల దగ్గర ఎంట్రెన్స్ ఫీజులు ఎవరివీ వారే పెట్టుకోవాలి. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో చూడచ్చు. 13 నుంచి 22 మంది ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే ఒకరికి రూ.505 చెల్లించాలి. 7 నుంచి 12 మంది ప్యాకేజీ బుక్ చేసుకుంటే ఒకరికి రూ.1,145 చెల్లించాలి. అదే ఈ ప్యాకేజీ 4 నుంచి 6 మంది బుక్ చేసుకుంటే ఒకరికి రూ.1,170 చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్‌సిటిసి అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News