మంబయి: మహారాష్ట్రలోని ముంబయి నగరం నాయక్ నగరంలో సోమవారం అర్థరాత్రి నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవనం శిథిలాల కింద ఇంకా 25 మంది వరకు చిక్కుక పోయి ఉండొచ్చని, ప్రస్తుతం 8 మందిని మాత్రం రక్షించామని స్థానిక అధికారి వెల్లడించారు.
గత రాత్రి 12.30 గంటలకు కుర్లా భవనం కూలిపోయిందని, ఘటన జరిగిన వెంటనే మంత్రి ఆదిత్య థాకరే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలో పాల్గొన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేస్తే ఇప్పటి వరకు భవనాలు ఖాళీ చేయడంలేదని అధికారులు వాపోతున్నారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాలు ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు ప్రజలను కోరుతున్నారు. శిథిలావస్థకు చేరిన భవనాలను కూలగొట్టి కొత్త భవనాలు నిర్మించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గతంలో బాంద్రా వెస్ట్ లోని శాస్త్రినగర్ లో భవనం కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా 19 మంది గాయపడిన విషయం విధితమే.