Monday, December 23, 2024

సైకో వీరంగం… ఒకరు మృతి… ఫుట్‌బాల్ ఆటగాడిని పొడిచి

- Advertisement -
- Advertisement -

రోమ్: ఇటలీలోని మిలాన్ ప్రాంతంలో ఓ సైకో సూపర్ మార్కెట్‌లో చొరబడి విచాక్షణరహితంగా పొడిచాడు. సూపర్ మార్కెట్‌లో ఓ అగంతకుడు కనపడిన ప్రతి ఒక్కరిని కత్తితో పొడిచాడు. సూపర్ మార్కెట్ క్యాషియర్ పొడవడంతో అతడు ఘటనా స్థలంలో మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో స్పానిష్ ఫుట్‌బాల్ ఆటగాడు పోబ్లో మారి ఉన్నాడు. పోబ్లో మారి తన భార్య, చిన్న కుమార్తెతో కలిసి మిలాన్‌లో ఉన్న సూపర్ మార్కెట్‌కు వచ్చాడు. మారి వెనక నుంచి సైకో కత్తితో పొడిచాడు. దీంతో వెంటనే అతడు కుప్పకూలిపోయాడు. మారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అలా ఎదురు వచ్చిన వాళ్లను సైకో పొడుచుకుంటూ వెళ్లిపోయాడు. కస్టమర్లు సైకోను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అతడికి మతిస్థిమితం లేకపోవడంతో ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేసున్నారు. ఇంకామైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News