Monday, January 20, 2025

టాటా ఎసిని ఢీకొట్టిన లారీ: ఒకరు మృతి.. 20 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

వెల్దుర్తి: టాటా ఎసిని లారీ ఢీకొన్న సంఘటన మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం… మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామం, వర్గల్ మండలం నాచారం గ్రామాలకు చెందిన వారు ఏడుపాయల వనదుర్గ మాతను దర్శించుకుని తిరిగి వస్తున్న క్రమంలో మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై టాటా ఎసిని వెనక వైపు నుంచి లారీ ఢీకొనడంతో ఒక్కరు అక్కడికక్కడే మృతి చెందారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News