Monday, December 23, 2024

ప్రాణం తీసిన ఈత సరదా ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

నల్గొండ: ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు కాలువలో కొట్టుకుపోయిన సంఘటన నిడమానూర్ మండలం నారమ్మగూడెం లో  శనివారం చోటు చేసుకుంది. కాలువలో కొట్టుకుపొతున్న  ఇద్దరు యువకుల్ని స్థానికులు కాపాడి బయటికి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.  ఈరోజు రాత్రి జరిగే వలీమా డిన్నర్ కి హైదరాబాద్ నుండి నారమ్మగూడెం కి యువకులు వచ్చారు.

సరదగా ఈత కొట్టడం కోసం కాలవలోకి దిగారు. కాలవలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు విషమంగా ఉన్న వ్యక్తిని నల్లగొండ ఎరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టమ్ నిమిత్తం మృతదేహన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.మృతుడు ఎస్.కె. లతీఫ్(22) గా పోలీసులు గుర్తించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News