Monday, December 23, 2024

విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

సంగెం: ప్రమాదశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఒకరు మృతిచెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కాపులకనపర్తి గ్రామానికి చెందిన సదిరం కొమ్మయ్య(57) ఇంటి ముందు బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు ఇంటిలోకి కరంటు సప్లై అయ్యే వైరు తెగిపోయి ఇనుప తీగ దండెంకు ఆనుకొని కరంటు సప్లై అయింది. రమ ఎడమ చేతికి తన తడి బట్టలు వేసే క్రమంలో తగిలి కరంటు షాక్‌కు గురై కేకలు వేసింది. ఇంటి ముందు ఉన్న తండ్రి కొమ్మయ్య ఎడమ చేయి మట్టపై ఆ కరంటు వైరు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పక్కనే ఉన్న మేకల ఎల్లయ్య, ఎర్ర పద్మ, సదిరం భరత్‌లు వచ్చి చూసే సరికి కొమ్మయ్య చనిపోయి ఉన్నాడన్నారు.కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ చందర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News