- Advertisement -
హైదరాబాద్: నగరంలోని అఫ్జల్ గంజ్ పరిధి మోకురం బజార్ లోని నాలాలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చెత్త సేకరించే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. చెత్తకుప్పలో సేకరించిన డబ్బాలోని రసాయనం నాలాలో పోస్తుండగా పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -