- Advertisement -
కాకినాడ: జిల్లాలోని సామర్లకోట మండలం గోలివారి కొత్తూరులో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లల మధ్య జరిగిన గొడవలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. క్రికెట్ ఆడి వస్తూ సూర్య, పండు ఇద్దరు బాలురు గొడవ పడ్డారు. ఇద్దరి నడుమ సైకిల్ విషయంలో ఘర్షణ జరిగింది. కింద పడిన సైకిల్ ను పైకి తీస్తున్న సమయంలో పండు బ్యాట్ తో సూర్య తలపై కొట్టాడు. విషయం ఎవరికైనా చెబితే చంపుతానని సూర్యను బెరించాడు. ఇంటికెళ్లి తలనొప్పి వస్తుందని సూర్య పడుకున్నాడు. అతని పరిస్థితి తేడాగా ఉండడంతో బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే సూర్య మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -