Thursday, January 23, 2025

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

 

 

దండేపల్లిః మండలంలోని కాసిపేట గ్రామానికి చెందిన అల్లంల రవి(39)అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై మచ్చ సాంబమూర్తి తెలిపారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలావున్నాయి. రవి అదే గ్రామానికి చెందిన సుదవేని మల్లేష్ మోటర్ సైకిల్‌పై ఈ నెల 22న మ్యాదరిపేటకు వెళ్ళాడు. రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా, ధర్మారావుపేట గ్రామ సమీపంలో మల్లేష్ మోటర్ సైకిల్‌ను అతివేగంగా నడిపి కింద పడటంతో రవికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం రవి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News