- Advertisement -
వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీతారాంపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తీగపై బట్టలు ఆరేస్తుండగా శ్రీను విద్యుదాఘాతానికి గురయ్యాడు. శ్రీనును కాపాడేందుకు వెళ్లి అత్త పెంటమ్మ విద్యుదాఘాతంతో మృత్యువాత పడింది. గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -