Monday, December 16, 2024

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..ఇద్దరికి గాయాలు

- Advertisement -
- Advertisement -

అర్వపల్లి : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలు అయిన సంఘటన జాజిరెడ్డిగూడెం మండలంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు ఎస్.ఐ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నగూడెం గ్రామ పంచాయతీ ఆవాస గ్రామమయిన చాకలిగూడెం గ్రామానికి చెందిన అక్కినపల్లి యాదగిరి (65) తన కుమారుడు సత్యనారాయణతో కలిసి తన వాహనం టివిఎస్ మోపైడ్ బైక్‌పై సూర్యాపేట కు వెళ్తుండగా తిమ్మాపురం మూలమలుపు జంబల్‌బోర్డు వద్ద ఎదురుగు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొనడంతో టివిసిఎస్ మోపైడ్ బైక్ పై నుండి రోడ్డుపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు .

తమ కుమారుడు సత్యనారాయణకు , రోడ్డు దాటుతున్న మరోవ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో చికిత్సనిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన యాదగిరిని పోస్టుమార్టం నిమత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇట్టి విషయంపై కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అంజిరెడ్డి, ఎఏస్‌ఐ క్రిష్ణమూర్తి తెలిపారు. మృతుడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News