Thursday, January 23, 2025

ఒకే కుటుంబం ఒకే బూతులో ఓటు వేసేలా చూడాలి

- Advertisement -
- Advertisement -

కేంద్ర ఎన్నికల సంఘానికి టీటీడీపీ ప్రతినిధి బృందం సూచన

మన తెలంగాణ/ హైదరాబాద్: ఎన్నికల్లో ఒక కుటుంబం ఒకే పోలింగ్ బూతులో ఓటు వేసేలా చూడాలని ఎన్నికల అధికారులను టిటిడిపి జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ కోరారు. ఆటంకాలు అసౌకర్యాలు కలగకుండా వాటి ఆధారంగా పోలింగ్ బూత్‌లను కేటాయించాలని సూచించారు. మంగళవారం కేంద్రం ఎన్నికల సంఘం పర్యటనలో భాగంగా గుర్తింపు పొందిన పార్టీలు రావాలని ఆహ్వానించింది. ఆపార్టీ తరుపున జాతీయ కార్యదర్శి కాసాని విరేష్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి సతీష్, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు.

ఈ సందర్భగా వారు మాట్లాడుతూ ఇంటింటికి నంబర్లు ఓటర్ స్లిప్పులు సంబంధిత ఓటర్లకు సరఫరా చేసి పారదర్శకతను ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని కఠినంగా పరిమితం చేయాలనీ, ఓటర్లకు ఏ విధమైన పథకాలు ప్రయోజనాలను ప్రకటించడం నిషేధించి ముందుగా నియోజక వర్గాల వారీగా మొత్తం ఓటర్ల జాబితాను అందించాలని అభ్యర్థన చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతోపాటు గ్రీవెన్స్ సెల్‌ను కూడా అందజేస్తుందని ఓటరు జాబితాకు సంబంధించి ఏదైనా దిద్దుబాటు, చేర్చడం తొలగించడం కోసం పారదర్శకంగా ఉండే విధంగా చూడాలన్నారు. ప్రచారానికి అడ్వటైజ్ మెంట్ బోర్డులను అన్ని పార్టీలకు సమానంగా అవకాశం కల్పించాలని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News