Wednesday, January 22, 2025

అమ్మాయి జన్మిస్తే నూటా పదకొండు మొక్కలు

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్‌లో సంప్రదాయం
ఉద్యమంలా కొనసాగిస్తున్న పద్మశ్రీ శ్యామ్ సుందర్ పలివాల్
భావోద్వేగంగా రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ను షేర్ చేసిన ఎంపి సంతోష్‌కుమార్

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆడబిడ్డ జన్మను పర్యావరణ రక్షణకు ముడిపెడుతూ పద్మశ్రీ శ్యామ్ సుందర్ పలివాల్ చేస్తున్న కృషిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ అభినందించారు. మూడు దశాబ్దాలుగా రాజస్థాన్, బలోత్రా జిల్లాలో శ్యామ్‌సుందర్ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫాదర్ ఆఫ్ ఎకో ఫెమినిస్ట్ గా పేరొందిన శ్యామ్ సుందర్ తన సొంత గ్రామం పిప్లాంత్రితో పాటు, చుట్టుపక్కల ఎక్కడ ఆడపిల్ల పుట్టినా, ఆ అమ్మాయి పేరు మీదు నూటా పదకొండు (111) మొక్కలు నాటడం, నాటించడం చేస్తున్నారు.

పర్యావరణం క్షీణతతో ఎంతటి విపత్తును ఎదుర్కొంటున్నామో, ఆడబిడ్డల నిష్ఫత్తి పడిపోతే సమాజం అంతే ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని ఆయన అంటారు. అందుకే స్త్రీలకు, ప్రకృతి రక్షణకు ప్రాధాన్యతను ఇస్తూ మొక్కలు నాటిస్తున్నారు. ఆయన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2021లో పద్మశ్రీతో సత్కరించింది. శ్యామ్ సుందర్ పలివాల్ కృషిలో భాగస్వామ్యమైన ఆస్ట్రల్ ఫౌండేషన్, ఆయా గ్రామాల్లో నాటిన మొక్కల పరిరక్షణ కోసం 13 కిలో మీటర్ల పైపులైన్ ను ఏర్పాటు చేసింది. ఆస్పత్రిలో అమ్మాయి పుడితే ఊరు ఊరంతా తరలిరావటం, వేడుకగా మొక్కలు నాటే పండగను భావోద్వేగంగా చిత్రీకరించిన షార్ట్ ఫిల్మ్‌ను ఎక్స్‌లో (ట్విట్టర్) ఎంపి సంతోష్‌కుమార్ షేర్ చేశారు. శ్యామ్‌సుందర్ పలివాల్ చేస్తున్న అద్భుతమైన కార్యక్రమమని సంతోష్ కొనియాడారు. స్త్రీ సాధికారత కోసం ఆయన చేస్తున్న కృషి కొనసాగాలని ఆకాంక్షించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News