Monday, January 20, 2025

నైజీరియా రిఫైనరీ పేలుడులో వంద మంది మృతి

- Advertisement -
- Advertisement -

One hundred killed in Nigerian refinery blast

ప్రాణాలు తీస్తున్న అక్రమ చమురు వ్యవహారం

అబూజా : నైజీరియా ఆగ్నేయ ప్రాంతంలో ఓ చమురు శుద్ధి కర్మాగారంలో పేలుడు జరిగి, కనీసం వంద మంది ఆహుతయ్యారు. ఇది ప్రమాదం కాదని విద్రోహ చర్యనే అని అనుమానిస్తున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఘటనాస్థలి వద్ద చెల్లాచెదరుగా పడి ఉన్న మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. ఈ ప్రమాదానికి కారకులని భావిస్తున్న ఇద్దరి కోసం అన్వేషిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నైజీరియాలోని ఒహజీ ఎగ్బెమా ప్రాంతంలో శుక్రవారం రాత్రి రిఫైనరీ ఉన్నట్లుండి పేలింది. చమురు ట్యాంకులకు మంటలు అంటుకున్నాయి. అప్పుడు ఇక్కడ వంద మందికి పైగా కార్మికులు విధులలో ఉన్నారని వెల్లడైంది. ఇది అక్రమ రిఫైనరీ అని అధికారులు తెలిపారు. పేలుడు జరిగి మంటలు అంటుకుంటూ ఉండటం చుట్టూ చమురు పారడంతో పలువురు తప్పించుకునేందుకు వీలుకాలేదు. అనేక మంది పేలుడు ధాటికి మృతి చెందినట్లు, పలువురు సురక్షిత ప్రాంతానికి పరుగులు తీసినట్లు స్థానికంగా ఉన్న వారు తెలిపారు. ఘటనలో మృతి చెందినవారంతా పూర్తిగా తగులబడి పోయి ఉన్నట్లు గుర్తించారు.

అయితే వీరి పేర్లు వివరాలు గుర్తించడం కష్టం కానుంది. ముడిచమురు ఉత్పత్తిలో ఆఫ్రికాలోనే నైజీరియా అతిపెద్ద వాటా దక్కించుకుంది. అయితే పలు సవాళ్లు , అక్రమ రిఫైనరీల నిర్వహణలతో తరచూ ఇక్కడ చమురు ఉత్పత్తికి గండిపడుతోంది. ఘటనకు బాధ్యులుగా ఇద్దరిని అనుమానిస్తున్నట్లు, ఇంతవరకూ అరెస్టులు ఏమీ జరగనట్లు స్థానిక అధికారి ఒకరు తెలిపారు. ఇక్కడి విషాద మృతుల సామూహిక ఖననాలకు ఏర్పాట్లు చేపట్టారు. ఆఫ్రికాలో ఎక్కువ జనాభా దేశం అయిన నైజీరియా చమురు సంపన్నం అయినా నిరుపేదలు, నిరుద్యోగం తీవ్రంగా ఉంది. దీనితో యువత ఎక్కువగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దొమ్మిలు దోపిడీలు సామూహిక హింసాకాండలకు పాల్పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News