- Advertisement -
హైదరాబాద్ : ఇంటర్మీడియట్‌లో మళ్లీ పూర్తిస్థాయి సిలబస్ వర్తింపజేయనున్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కరోనా మహామ్మారి వల్ల రెండేళ్లుగా 30 శాతం సిలబస్ ను తొలగించిన ఇంటర్ బోర్డు, 70 శాతం సిలబస్‌ను మాత్రమే అమలు చేసింది. ఈ విద్యా సంవత్సరంలో వంద శాతం సిలబస్ ను అందుబాటులోకి తేనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు. ఇంటర్ మొదటి, రెండోవ సంవత్సరాలకు పూర్తి సిలబస్ పెట్టనున్నారు. త్వరలో వెబ్ సైట్ లో సిలబస్ అప్ లోడ్ చేస్తామని జలీల్ పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు, సిబిఎస్‌ఈ నిర్ణయం మేరకు 2021-22 విద్యా సంవత్సరంలో ఇదే విధానాన్ని అమలు చేసిన ముచ్చట తెలిసిందే. 2023లో నిర్వహించే వార్షిక పరీక్షలను వందశాతం సిలబస్‌తో నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది.
- Advertisement -