Monday, January 20, 2025

‘ఒక దేశం- ఒకే పెవిలియన్’లో ఎపి, తెలంగాణ ప్రదర్శన..

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రపంచ ఆర్థిక సదస్సులో ’‘ఒక దేశం ఒకే పెవిలియన్’ గా భారత్ గా ప్రదర్శన జరగనుంది. దావోస్ లో 6 రాష్ట్రాలకు అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఎపి, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, యూపీ, కేరళ రాష్ట్రాలకు అవకాశం లభించింది.  ముగ్గురు సిఎంలు మాత్రమే హాజరయ్యేందుకు కేంద్రం అనుమతించింది. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఫడణవీస్ లు మాత్రమే హాజరు కానున్నారు. భారత్ నుంచి హాజరయ్యే ప్రతినిధి బృందంలో ఐదుగురు కేంద్రమంత్రులు ఉండనున్నారు. రేపు సిఐఐ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ పై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం చర్చ జరపనున్నారు. ఈ సందర్భంగా రోజుకు కనీసం పదిమందికి పైగా సమావేశాల్లో పాల్గొననున్నారని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తదుపరి యూఎఈ ఆర్థిక మంత్రి అబ్ధుల్లా బిన్ తో సిఎం బృందం సమావేశమయ్యారు. మూడో రోజు బడా పారిశ్రామిక వేత్తలతో బృందం సమావేశం జరగనుందని సిఎం చెప్పారు. నాలుగురోజు దావోస్ నుంచి జ్యురిచ్ మీదుగా స్వదేశానికి రావడం జరుగుతుందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News