- Advertisement -
ప్రకాశం: జిల్లాలోని బల్లికురువ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం మండలంలోని కూకట్ పల్లిలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు మృతి చెందాడు. దీంతో దాడిచేసిన యువకుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన యువకుడిని పల్లెల రామకృష్ణారెడ్డి(25)గా గుర్తించారు. ఈ ఘటనపై నిందితుడిని విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.
One Killed after attack with knife in Prakasam
- Advertisement -