- Advertisement -
మహబూబాబాద్: మిడ్ వెస్ట్ గ్రానైట్ లో పేలుడు సంభవించి ఓ కూలి మృతి చెందాడు. జిల్లాలోని కేసముంద్రం మండలం అర్పణపల్లి శివారులోని మిడ్ వెస్ట్ గ్రానైట్ లో బుధవారం ఉదయం బాంబు బ్లాస్టింగ్ ఘటనలో అమీర్ పాషా(55) అనే కూలీ మరణించగా, మరో ఇద్దరు కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు ఆందోళన చేస్తున్నారు. వరుస బ్లాస్టింగ్ లతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
- Advertisement -