- Advertisement -
రంగారెడ్డి: జిల్లాలోని మైలార్ దేవ్ పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. దుర్గానగర్ చౌరాస్తాలో గురువారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి, రోడ్డుపై ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దవాఖానాకు తరలించారు. మద్యం మత్తులో విద్యార్థులు కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -