- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో దీపావళి పండుగ వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో బాణసంచా పేలి వ్యక్తి మృతి చెందాడు. బాణసంచా తయారు చేస్తున్న సమయంలో పేలడంతో ఇల్లు ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
One Killed after Firecracker blast in Rajahmundry
- Advertisement -