- Advertisement -
చెన్నై: నగరంలోని ఈరోడ్ లోని బ్లీచింగ్ పౌడర్ ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం విష వాయువు లీక్ కావడంతో ఒకరు మృతి చెందారు. మరో 17మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసలు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు చెప్పారు.
One Killed after toxic gas leak in Chennai
- Advertisement -