Sunday, January 12, 2025

పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One killed Clashes between students in hyderabad

హైదరాబాద్: పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొని ఒకరు మృతి చెందిన సంఘటన హైరదాబాద్ కృష్ణానగర్ లోని సాయికృపా పాఠశాలలో బుధవారం చోటుచేసుకుంది. తరగతి గదిలో పేపర్ బంతితో క్రికెట్ ఆడుతుండగా పదో తరగతి విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. నలుగురు విద్యార్థుల దాడిలో ఒక విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. తక్షణమే గాయపడిన మన్సూర్ ను యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. విద్యార్థి అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం నిర్ణక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

One killed Clashes between students in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News