Sunday, December 22, 2024

బైక్ ఢీకొని ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

కొండపాక : బైక్ ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండల కేంద్రంలోని సత్యసాయి కళాశాల సమీపంలో గురువారం చోటు చేసుకుంది. కుకునూరు పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యసాయి కళాశాలలో పని చేస్తున్న చేగుంట రాజు (35) పనులు ముగించుకొని ఇంటికి వెలుతున్న సమయంలో రాజీవ్ రహదారి నుండి కొండపాక వైపు వెలుతున్న త్రియూర్తి ,రాబర్ట్ ,టేక్ లాల్ , ముగ్గురు వ్యక్తులు ఒకే బైక్ పై వెళుతూ రాజును ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో రాజుకు తీవ్ర గాయాలు కాగా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాజు మృతి చెందాడు. ఢీ కొట్టిన బైక్‌పై ఉన్న ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసును కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పుష్పరాజ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News