Tuesday, December 24, 2024

కశ్మీర్‌లో పేలుడు.. ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

జమ్మూ: కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే ఉధంపూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. స్లాహిత చౌక్ వద్ద పేలుడు జరిగింది. ఈ సమయంలో అక్కడ చిల్లర వ్యాపారులు పలువురు దైనందిన వ్యాపార కార్యకలాపాలలో ఉన్నారు.
సెలవుపై వచ్చిన సైనికుడి గల్లంతు
కశ్మీర్‌లోని బద్గామ్‌లో సెలవుపై ఇంటికి వచ్చిన ఓ సైనికుడు తమ గ్రామంలోని ఇంటి నుంచి కన్పించకుండా పొయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ప్రాంతంలోని మిలిటెంట్లు తమ వాడిని అపహరించుకుని వెళ్లినట్లు తాము అనుమానిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమీర్ అహ్మద్ మల్లా అనే జవాను సమీపంలోని వేరే ఊరికి వెళ్లి తిరిగి రాలేదని, ఆయన సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని పోలీసులు నిర్థారించారు. ఘటనపై బద్గామ్ జిల్లా ఎస్‌పి స్పందించారు. భార్య రెండో కాన్పు సమాచారం అందడంతో ఈ సైనికుడు ఊరికి వచ్చాడని తెలిపారు. ఉగ్రవాదులు ఆయనను అపహరించుకుని వెళ్లారా? అని ప్రశ్నించగా దీనిని కొట్టిపారివేయలేమన్నారు.

One Killed in Blast in Jammu Kashmir

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News