Sunday, December 22, 2024

అదుపు తప్పి కారు బోల్తా..వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

కుకునూరుపల్లి: రాజీవ్ రహదారిపై కారు అదుపు తప్పి డివైర్‌ను డీకొట్టి బొల్తా పడిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన కుకునూరుపల్లిలో చోటు చేసుకుంది. కుకునూరు పల్లి ఎస్‌ఐ పుష్పరాజ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఎఎస్‌పేట మండలం అంబసహేబ్ పేట గ్రామానికి చెందిన గంగపట్నం వంశీ హైదరాబాద్‌లో ఆమెజాన్ డెలివరిలో పని చేస్తున్నాడు. సెలవు రోజుల్లో తన కారును కిరాయిలకు తిప్పేవాడు. అదే క్రమంలో శనివారం సాయంత్రం మంచిర్యాలకు

కిరాయి వెళ్లి ఆదివారం తిరుగు ప్రయాణం హైదరాబాద్‌కు వెలుతున్న క్రమంలో మార్గమధ్యలో రాజీవ్ రహదారి కుకునూరుపల్లి గ్రామ శివారు రాగానే అతి వేగంగా కారు అదపు తప్పి డివైడర్ పైన ఉన్న కరెంట్ పోల్‌ని ఢీకొట్టగా డివైడర్ అవతల వైపు కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న గంగ పట్నంవంశీ తలకు తీవ్ర గాయాలు అయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News