Wednesday, January 22, 2025

మణిపూర్‌లో కాల్పులు.. ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లోని కంగ్‌పోక్పి జిల్లాలో గురువారం అల్లరిమూకలు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందారు. కొందరు గాయపడ్డారు. గురువారం ఉదయం జిల్లాలోని హరావ్‌తెల్ గ్రామంలో ఓ గుంపు రోడ్లపైకి వచ్చి అకారణంగానే కాల్పులకు పాల్పడింది. దీనితో జనం పరుగులు తీశారు. పలు చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దుండగులు జరిగిన కాల్పుల్లో పలువురు మృతి చెందినట్లు స్థానిక ఆర్మీ విభాగం అనిర్థారిత వార్తలను ఉటంకించింది. అయితే ఘటన తరువాత ఈ ప్రాంతంలో ఒక మృతదేహాన్ని గుర్తించినట్లు ,

మరికొందరు నేలపై పడి ఉన్నట్లు తెలిసిందని అధికారులు వివరించారు. చాలా సేపటివరకూ ఈ ప్రాంతంలో కాల్పులు జరుగుతూ వచ్చినందున ఎందరు చనిపొయ్యారనేది వెంటనే నిర్థారణ కాలేదు. తెల్లవారుజాము నుంచి ఆరంభమైన కాల్పులు తరచూ జరుగుతూ వచ్చాయి. అయితే దుండగులు చాలా తెలివిగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి కాల్పులు జరపడం పారిపోవడంతో వీరిని కట్టడి చేయడం సాధ్యం కాకుండా పోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News