Wednesday, January 22, 2025

పటాన్ చెరులో వ్యక్తి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: పటాన్ చెరు మండలంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి ఇస్నాపూర్ శివారులో ఓ వ్యక్తిపై కొందరు దుండగులు దాడి చేసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. మృతుడిని నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన అబ్దుల్ నదీమ్ తాహెర్(28)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News