- Advertisement -
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ లో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంలో ప్రయాణించిన బైకు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -