- Advertisement -
మహబూబ్‌నగర్: జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ధర్మాపూర్ వద్ద హైదరాబాద్-రాయచూర్ హైవేపై వేగంగా దూసుకొచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
One Killed in Road Accident in Mahabubnagar
- Advertisement -