Sunday, December 22, 2024

రాహుల్ పర్యటన వేళ…మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటన నేపథ్యంలో గురువారం ఉదయం పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో తాజాగా జరిపిన హింసాకాండలో ఒక వ్యక్తి మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు.

గ్రామస్తులపై కొందరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దుండగుల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు వారు చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ మణిపూర్‌ను సందర్శించనున్న రోజే ఈ ఘటన జరగడంతో రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.

నిర్వాసితులను కలుసుకోవడానికి చురాచంద్రాపూర్, బిష్ణుపూర్ జిల్లాలలో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలను రాహుల్ గాంధీ సందర్శించనున్నారు. మే 3వ తేదీ నుంచి మీటీ, కుకీ తెగల మధ్య జరుగుతున్న హింసాకాండలో ఇప్పటివరకు కనీసం 115 మంది మరణించగా 60 వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News