Monday, November 18, 2024

పోల‘రణం’ కేంద్రం పాపమే

- Advertisement -
- Advertisement -

పోలవరం బ్యాక్ వాటర్‌పై అధ్యయనానికి
సిడబ్లుసికి లేఖలు రాసినా స్పందన లేదు

లక్ష ఎకరాలకు ముంపు ముప్పు భద్రాచలం ఆలయం, పర్ణశాల మునిగిపోయే
ప్రమాదం కేంద్ర జల సంఘంలోని 18విభాగాల అనుమతి తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం
ర్షపాతం తీవ్రతపై ఐఎండి, శాటిలైట్ ఏజెన్సీల నుంచి సరైన సమాచారం లేదు
వరద నష్టం అంచనాపై కథనాలు నిరాధారం భారీ వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టులకు
రూ.25కోట్ల నష్టం ఆ నష్టాలతో ప్రభుత్వానికి సంబంధం లేదు.. వాటిని నిర్వహణ
సంస్థలే భరిస్తాయి కాళేశ్వరం పంప్‌హౌస్‌ల మరమ్మతు పనులు పూర్తి
కడెం ప్రాజెక్టు సురక్షితం : నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆ ప్రాజెక్టు వెనుక జలాల్లో లక్షల ఎకరాలు మునిగిపోతాయని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ వెల్లడించారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలు వరదలపై బుధవారం నాడు ఎర్రమంజిల్‌లోని తన కార్యాలయంలో నీటి శాఖ అధికారులతో రజత్ కుమార్ సమావేశం నిర్వహించారు. శ్రీరాంసాగర్ , కెడెం , కాళేశ్వరం ప్రాజెక్టులు, భద్రాచలం ప్రాంతంలో గోదావరి పరివాహకంగా వాటిల్లిన వరద ముప్పు , ప్రాజెక్టుల భద్రత తదితర అంశాలను ఈ సందర్బంగా స్పెషల్ సిఎస్ అధికారులతో సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తియితే రిజర్వాయర్ బ్యాక్ వాటర్ వల్ల లక్ష ఎకరాల వరకూ మునిగిపోనుందన్నారు. అంతే కాకుండా పంటనష్టాలు కూడా భారీగా ఉంటాయన్నారు. అత్యంత చారిత్రాత్మక ప్రసిద్ధ్ద భద్రాచలం సీతారామ స్వామి ఆలయ ప్రాంతంతోపాటు పరమ పవిత్రంగా భావించే పర్ణశాల కూడా మునిగిపోతుందని వెల్లడించారు.

పోలవరం ప్రాజెక్టు వెనుక జలాలకు సంబంధించి ప్రత్యేకంగా సమగ్ర అధ్యయనం చేయాలని , వరద ముప్పుపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర జలసంఘానికి పలు మార్లు లేఖలు రాశామని తెలిపారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్షవైఖరితో ఉందని, కేంద్రం నుంచి ఇంతవరకూ ఎటువంటి స్పందన రాలేదని తెలిపారు. భారీ వర్షాలు వరదలకు సంబంధించి అధికార యంత్రాగాన్ని ముందుగానే అప్రమత్తం చేశామన్నారు. జలవనరుల శాఖలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగం ఏర్పాటు చేసి కడెం ప్రాజెక్టుకు ఇటీవలే మరమ్మతులు చేశాం కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. కడెం ప్రాజెక్టు ఎగువ పరివాహక ప్రాంతంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు మండలాల్లో గడిచిన వందేళ్లలో ఎన్నడూ లేనంతగా 300 మి. మీ భారీ వర్షం కురిసిందని తెలిపారు.

వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా క్లౌడ్ బరస్ట్ లాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు.వరదలు, వర్షాలపై ప్రభుత్వం సంసిద్ధంగా లేదనడం సరికాదన్నారు. వరద నష్టం అంచనాలపై మీడియాలో వస్తున్న కథనాలు నిరాధారమైనవని కొట్టిపారేశారు.కొంతమంది చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీడబ్ల్యూసీలోని 18 విభాగాల అనుమతి తరువాతనే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు.భారత వాతావరణ శాఖ (ఐఎండి) డేటా యూరోపియన్ శాటిలైట్ ఏజెన్సీల నుంచి కూడా వర్షపాతం తీవ్రతపై సరైన సమాచారం అందలేదని తెలిపారు.ఆ సంస్థలు కూడా భారీ వర్షాలు వదరల పరిస్థితిని కచ్చితంగా అంచనా వేయలేకపోయాయని వెల్లడించారు.

45రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు సిద్దం:

భారీ వరదల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు సుమారు 20 నుంచి 25 కోట్ల రూపాయల విలువ మేరకు నష్టం వాటిల్లిందని ప్రాధమిక అంచనాలను బట్టి తెలుస్తోందన్నారు.అయితే ముందుగా ప్రభుత్వంతో కుదుర్చుకున్న అగ్రిమెంట్లో పేర్కొన్న విధంగా ఆ నష్టాన్ని ప్రాజెక్టు నిర్వహణ సంస్థలే భరిస్తాయని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన వరద నష్టాలకు సంబంధించి ప్రభుత్వానికి సంబందం లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం పంప్ హౌజ్ ల మరమ్మత్తు పనులు 45రోజుల్లోపే పూర్తవుతాయన్నారు. సెప్టెబంర్‌లో పంప్‌హౌస్‌లు తిరిగి నడుస్తాయన్నారు. ఇప్పటికే ఇక్కడ విద్యుత్ సరఫరాను పునరుద్ధ్దరించినట్టు తెలిపారు.కడెం , కాళేశ్వరం కింద జరిగిన పరిస్థితులపై కమిటీ విచారణ చేస్తోందని రజత్ కుమార్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News