మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన బిసి కులవృత్తులకు రూ.లక్ష ఆ ర్థిక సాయం పథకానికి ప్రభుత్వం రూ. 400 కో ట్లు విడుదల చేసింది. ఇందుకు సంబంధించి బిసి సంక్షేమ శాఖ మంగళవారం ఉత్తర్వులు జా రీ చేసింది. కులవృత్తులు, చేతివృత్తి పనుల చేసుకు నే బిసి కుటుంబాలకు ఆర్థిక సాయం అందిం చే పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను బిసి మం త్రిత్వ శాఖ ఇప్పటికే ప్రారంభించింది. ఇందు కోసం రూ.400కోట్ల నిధులను బిసి సంక్షేమ శా ఖ విడుదల చేసింది. ఈ నిధులను పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు అందించనున్నారు అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకెళ్తున్న రా ష్ట్ర ప్రభుత్వం కులవృత్తులు, చేతివృత్తులకు చే యూతనందించేందుకు ఆర్థిక సాయం ప్రకటించింది. ఆర్థిక సాయం కోసం వి శ్వ బ్రహ్మణులు, నాయీ బ్రహ్మణులు, రజకులు, కుమ్మరి, మేదరి తదితర కులాలకు చెందిన వారు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అర్హులై న వారికి పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు కో సం ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. గ్రామాలవారీగా అం దిన దరఖాస్తులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించి, అర్హులైన వా రి జాబితాలు రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం సూ చించింది. కలెక్టర్లు గ్రామ పం చాయ తీ కార్యదర్శులకు ఈ బాధ్యతలు అప్పగించారు. మండల స్థాయి అధికారులు దీనిపై పర్యవేక్షణ చేయాలని సూచించారు.
బిసి చేతి వృత్తులకు లక్ష సాయం.. రూ. 400 కోట్లు రిలీజ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -