Thursday, January 23, 2025

కులవృత్తులకు జీవం పోసేందుకే బిసిలకు లక్ష సాయం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : కుల వృత్తులకు జీవం పోసేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి కుటుంబానికి లక్ష సాయం అందజేస్తున్నారని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో 32మంది కులవృత్తులకు లక్ష సాయం చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తి చేసుకునే ప్రతి బిసి కుటుంబం ఆత్మగౌరవంతో బతకాలన్నారు. చేతి కుల వృత్తులకు సహాయం చేయాలని ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి లక్ష సాయం అందజేస్తున్నామని వెల్లడించారు. సిఎం కెసిఆర్ అందిస్తున్న లక్ష సాయంతో ప్రతి లేబర్ ఓనర్ కావాలని ఆకాంక్షించారు. బిసి బంధు నిరంతర ప్రక్రియ అని ఎవరు నిరాశ పడకూడదని దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి విడుదల వారీగా సాయం అందిస్తామని వెల్లడించారు.

గతం ప్రభుత్వాల హయాంలో ఇచ్చే రుణాలకు బ్యాంకు గ్యారంటీ అడిగేవారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందజేసే లక్ష సాయానికి బ్యాంకు గ్యారంటీ లేకుండా తిరిగి చెల్లించే అవసరం లేకుండా అందజేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో ప్రతి బిసి కులానికి హైదరబాద్ నడి ఒడ్డున కోకాపేటలో వేల కోట్ల విలువైన భూములు ఆత్మగౌరవ బోనాలకు కేటాయించామన్నారు. సిఎం కెసిఆర్ అందిస్తున్న లక్ష రూపాయల సాయంతో ప్రతి లేబరు ఓనర్ కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

ఇది నిరంతర ప్రక్రియ అని ఎవరు నిరాశపడకూడదని, దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి విడుదలవారీగా సాయం అందిస్తామన్నారు. నిజమైన లబ్ధిదారులకు సాయంఅందజేయాలనే సంకల్పంతో పకడ్బందీగా దరఖాస్తులు పరిశీలిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై. సునీల్‌రావు, గ్రంథాలయ చైర్మన్ అనిల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మధు, ఎంపీపీ లక్ష్మయ్య, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News