Monday, December 23, 2024

బైండోవర్ ఉల్లంఘన.. రూ.లక్ష జరిమానా విధింపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గూడూరు : కేసముద్రం మండలంలోని గిర్నితండాకు చెందిన బానోతు కృష్ణ అనే వ్యక్తికి తహసీల్దార్ ఫరీదుద్దీన్ రూ.లక్ష జరిమానా విధించడంతో బానోతు కృష్ణ రూ.లక్ష జరిమానా చెల్లించడం జరిగింది. కేసముద్రం మండలం గిర్నితండాకు చెందిన బానోతు కృష్ణ అనే వ్యక్తి గతంలో నాటుసార, నల్లబెల్లం కేసుల్లో ముద్దాయిగా ఉండడంతో అతనిని కేసముద్రం తహసిల్దార్ ఫరీదుద్దీన్ ముందు బైండోవర్ చేసినట్లు గూడురు సిఐ భిక్షపతి తెలిపారు. అయిదే సదరు బానోతు కృష్ణ మళ్లీ నల్లబెల్లం, నాటుసారాయి రవాణ చేస్తూ పట్టుపడడం జరిగిందన్నారు.

అయితే బైండోవర్ నియమాలను ఉల్లంఘిస్తూ మళ్లీ నాటుసారా, నల్లబెల్లం రవాణ చేస్తూ పట్టుబడడంతో బైండోవర్ నియమాలను పాటించడం లేదని, ఉల్లంఘన నియమాల కింద సదరు బానోతు కృష్ణను కేసముద్రం తహసీల్దార్ ఫరీదుద్దీన్ ఎదుట ప్రవేశపెట్టగా రూ.లక్ష జరిమానా విధించడంతో రూ.లక్ష జరిమానాను ప్రభుత్వ చాలన్ ద్వారా గురువారం చెల్లించడం జరిగిందని సిఐ తెలిపారు. ఈకార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్ బుచ్చయ్య, కానిస్టేబుళ్లు, సుధాకర్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News