- Advertisement -
న్యూఢిల్లీ : దేశీయ ఇకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్‌లో భారీగా ఉద్యోగాల సృష్టిని లక్షంగా చేసుకుంది. సప్లై చైన్ నుంచి క్యాటర్ వరకు దాదాపు 1 లక్షకు పైగా సీజనల్ జాబ్‌లు అవకాశాలు కల్పించనుంది. సీజనల్ జాబ్‌లలో స్థానిక కిరాణా డెలివరీ భాగస్వాములు, మహిళలతో కలిపి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు రెండూ ఉంటాయి. పర్సన్స్ విత్ డిజబులిటీస్ (పిడబ్లుడిలు) కూడా డెలివరీ సప్లై చైన్‌లో ఉద్యోగాలను పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ పండుగ సీజన్‌కు ముందు ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, సార్టేషన్ సెంటర్లు, డెలివరీ హబ్‌లతో పాటు సప్లై చైన్ వ్యాప్తంగా 1,00,000 కొత్త జాబ్ అవకాశాలను ఆశిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.
- Advertisement -