Tuesday, December 31, 2024

బిసిలకు లక్ష రూపాయల సాయం నిరంతర ప్రక్రియ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలోని కులవృత్తుల్లోని చేతివృత్తుల వారి జీవన ప్రమాణాలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న లక్ష రూపాయల పథకం నిరంతర ప్రక్రియ అని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం డా.బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్యక్షతన కాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పథకం తొలిదశ అమలును బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం కాబినెట్ సబ్ కమిటీకి వివరించారు, అమలు తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం తపిస్తారని తెలిపారు. కులవృత్తుల్లోని చేతివృత్తులకు చేయూత నిచ్చేందుకు, ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ప్రత్యేకంగా లక్ష రూపాయల సాయాన్ని ప్రకటించారని తెలిపారు. శనివారం వరకూ 2.70 లక్షల ధరఖాస్తులు ఆన్‌లైన్ లో నమోదయ్యాయని వెల్లడించారు. బిసిలకు లక్ష సాయం నిరంతర ప్రక్రియ అని చెప్పారు. అర్హతకలిగిన లబ్దిదారుల్లోని అత్యంత పేదలకు ముందు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ప్రతి నెల 5వ తేదీ లోపు కలెక్టర్లు లబ్దిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. ఇంచార్జి మంత్రులు ద్రువీకరించిన జాబితాలోని లబ్దిదారులకు ప్రతి నెల 15న స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేస్తామన్నారు. ధరఖాస్తుదారులు https://tsobmmsbc.cgg.gov.in వెవ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ఫారంను ఏ ఆఫీసులోనూ, ఏ అధికారికి గానీ సమర్పించాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.

ఎంపికైన లబ్దిదారులు నెలరోజుల్లోపు తమకు నచ్చిన, కావాల్సిన పనిముట్లను, సామాగ్రిని కొనుక్కోవాలని సూచించారు లబ్దిదారుల నిరంతర అభివ్రుద్ది కోసం అధికారులు పర్యవేక్షిస్తారని, నెలలోపు లబ్దిదారులతో కూడిన యూనిట్ల పోటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, బిసి సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News