బ్యాంకు సెలవుల కారణంగా మూడ్రోజులు వాయిదా
తొలి దశలో 10వేల మందికి పంపిణీ
హోం మంత్రి మహమూద్ అలీ ప్రకటన
విద్యార్థి అస్రార్ పైలట్ శిక్షణకు రూ. 35 లక్షల విడుదలకు సిఎం ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ముస్లిం మై నారిటీలకు 100 శాతం సబ్సిడీ పథకం కింద లక్ష రూపాయలను అందజేయనుందని హోంశాఖ మంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ తెలిపారు. చెక్కుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఉం డడంతో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో రూ.లక్ష చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 16న కాకుండా ఆగస్టు 19న నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పరిధిలోని మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎంపిక చేసిన 3,600 మందికి ఒక్కొక్కరికి రూ.లక్ష చెక్కులను పంపిణీ చేయనున్నట్లు మం త్రి తెలిపారు. కాగా జిల్లాల్లో ఎంపిక చేసిన వారిలో మొదటి దశలో పు 10వేల మందికి ఒక్కొక్కరికి రూ. లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చే స్తారని అన్నారు.
రోజుల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చెక్కుల పంపిణీ జరగనుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నదన్నారు. తెలంగాణలోని మైనారిటీ లు, ముఖ్యంగా ముస్లింల సంక్షేమం కోసం ఎంతో కృషి జరుగుతుందన్నారు. 100 శాతం సబ్సిడీ పథకం కింద లబ్ధిదారులు ఒక్క రూపా యి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని మం త్రి తెలిపారు. మహబూబ్ నగర్ నివాసి, మై నారిటీ జూనియర్ కళాశాల విద్యార్థి మహ్మద్ అస్రార్ ఇంటర్మీడియట్‌లో జాతీయ స్థాయిలో ఎఎం ఈ సీటు కోసం 158వ ర్యాంక్‌ను పొం దారని, కానీ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో పైలట్ కోర్సులోప్రవేశించడం అసాధ్య మైందన్నారు. తన వినతి మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ మొహమ్మద్ అస్రార్ పైలట్ కావడానికి రూ.35 లక్షలను విడుదల చేయాలని మైనారి టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. సాల్వి ఫాతిమా పైల ట్ విద్యను అభ్యసించేందుకు తెలంగాణ ప్రభు త్వం రూ.30 లక్షలు సాయం చేసిందని తెలిపా రు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధికి పాటు పడలేదని హోంమంత్రి దుయ్యబట్టారు. 48 ఏళ్ల కాంగ్రెస్ పాలన కన్నా తొమ్మిదన్నరేళ్ల బిఆర్‌ఎస్ పాలన ఎంతో మిన్న అన్నారు. ఈ తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల కోసం నాలుగు రెట్లు ఎక్కువ నిధులు వెచ్చించిందని, త్వరలో ముస్లిం పారిశ్రామిక వేత్తల కోసం ప్రత్యేక సబ్సిడీ పథకాన్ని ప్రారంభిస్తామని హోం మంత్రి వివరించారు.