- Advertisement -
ఢిల్లీ: దేశంలో పేలుళ్లకు కుట్రపన్నిన కేసులో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయిలోని జోగేశ్వరి ప్రాంతానికి చెందిన జకీర్ ను అరెస్ట్ చేశారు. జకీర్‌ను ముంబయి యాంటీ టెర్రరిజం స్కాడ్ అదుపులోకి తీసుకుంది. ఉగ్ర కుట్రలో జకీర్‌కు సంబంధం ఉందని ఎటిఎస్ అధికారులు వెల్లడించారు. ముంబయికి ఆయుధాలు, పేలుడు పదార్థాలు పంపాలని జకీర్ కోరారు. దేశంలో పండుగలను లక్ష్యంగా చేసుకొని వరుస పేలుళ్లకు కుట్ర పన్నారు. ఉగ్ర కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్లో శిక్షణ పొందిన ఇద్దరు ఉగ్రవాదులతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ముష్కరుల నుంచి పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -