శ్రీకాకుళం: చేపల కూర విషయంలో గొడవ జరగడంతో ఓ వ్యక్తి హత్యకు గురైన సంఘటన ఎపిలోని శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో జరిగింది. కాకినాడకు చెందిన గంటా పాండురంగారావు అవలింగిలో అద్దెకు తీసుకొని భవన కార్మికుడిగా పని చేస్తున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాకు చెంది ప్రసాదన్ అవలంగి గ్రామానికి తీసుకొని వచ్చాడు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి చేపల కూర తీసుకొని మద్యం తాగాటానికి గ్రామ శివారులోనికి వెళ్లారు. చేపల కూర విషయంలో పాండురంగారావు, ప్రసాద్ ల మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ప్రసాద్ తలపై పాండు రంగారావు మంచం కోడ్ తో గట్టిగా కొట్టాడు. ఘటనా స్థలంలో ప్రసాద్ చనిపోయాడు. ప్రసాద్ హత్య బయటకు తెలియడంతో గ్రామస్థుల సమాచారం మేరకు ఎస్ఐ మధుసూదన రావు తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని విఆర్ఒ సమక్షంలో పాతి పెట్టిన మృతదేహాన్ని బయటకు శవ పరీక్ష స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
ప్రాణం తీసిన చేపల కూర లొల్లి….
- Advertisement -
- Advertisement -
- Advertisement -