Thursday, December 26, 2024

డిసిఎంని ఢీకొట్టిన బైక్: యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

RTC Bus Driver died in road accident in Gadwal

మేడ్చల్: డిసిఎంను బైక్ ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ ప్రాంతం బహదూర్ పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సంతోష్ అనే యువకుడు బైక్ వెళ్తూ బ్రేక్ డౌనయిన డిసిఎం ఢీకొట్టడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. సంతోష్ తన స్నేహితుడితో కలిసి సూరారం నుంచి గండిమైసమ్మకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News