- Advertisement -
వేల్పూరు: నిజామాబాద్ జిల్లా వేల్పూరు ఎక్స్ రోడ్డు జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు దగ్ధమైంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ఇద్దరు సజీవదహనమయ్యారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కాలిపోయిన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు జగిత్యాల జిల్లాకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకున్నారు.
- Advertisement -