Thursday, January 23, 2025

కరోనా వార్డులో అగ్ని ప్రమాదం: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: కరోనాకు చికిత్స అందిస్తున్న వార్డులో అగ్ని ప్రమాదంలో చోటుచేసుకోవడంతో ఒకరు మృతి చెందిన సంఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రం బుర్ధాన్ మెడికల్ కాలేజీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొవిడ్ వార్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో రోగులు భయంతో పరుగులు తీశారు. ఆస్పత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ మంటల్లో చిక్కుకొని సంధ్యరాయ్ (60) అనే వ్యక్తి చనిపోయాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేసింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. అగ్ని ప్రమాదం జరిగిన వార్డులో ఫోరెన్సిక్ వారితో విచారణ జరిపిస్తామని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రబీర్ సేన్ గుప్తా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News