Thursday, January 23, 2025

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్‌పిఎఫ్ బలగాల కాల్పులు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులపై ఆర్‌పిఎఫ్ బలగాలు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందారు. ప్లాట్‌ఫాం నంబర్ వన్‌పై యువకుడు మరణించారు. ఆర్‌పిఎఫ్ బలగాలు కాల్పుల్లో పలువురు ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు. కాళ్లు, చేతులు, వీపు సహా ఇతర భాగాల్లోకి బుల్లెట్లు తగలడంతో 20 మంది వరకు గాయపడినట్టు సమాచారం. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన ఆందోళనకారులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా పలు రైళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News