Thursday, January 23, 2025

రణ్‌బీర్ సినిమా షూటింగ్ సెట్‌లో అగ్ని ప్రమాదం… ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One Member dead in Ranbir cinema shooting fire accident

 

ముంబయి: బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ముంబయిలోని అంధేరి చిత్రకూట్ మైదానంలో సినిమా షూటింగ్ సెట్ నిర్మించారు. ఈ సెట్‌లో మంటలు చెలరేగడంతో అందరూ ఊపిరి బిగపట్టుకొని పరుగులు తీశారు. మనీశ్ దేవాశీ(32)కి మంటలు అంటుకోవడంతో ఘటనా స్థలంలోనే అతడు చనిపోయాడు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సినిమా యూనిట్ సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు రణ్‌బీర్, శ్రద్ధాకపూర్ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సినిమాలో రణ్‌బీర్‌కు తోడుగా శ్రద్ధాకపూర్ నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News