Monday, December 23, 2024

నల్లగొండ పేలుడు ఘటనలో మరొకరు మృతి

- Advertisement -
- Advertisement -

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద గల హిందీస్ కంపెనీలో గత నెల 24 వ తేదీన జరిగిన పేలుడు ఘటనలో మరొకరు మృతి చెందారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో కాలిన గాయాలతో చికిత్స పొందుతూ జార్ఖండ్ కు చెందిన బల్దేవ్ అనే కార్మికుడు దుర్మరణం చెందాడు. మరో ఐదుగురు కార్మికులు గాయాల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. లక్ష్మారెడ్డి అనే బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  గత నెల కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో  ఏడుగురు కార్మికులు గాయపడిన విషయం తెలిసిందే.  హిందీస్ కంపెనీలో రియాక్టర్ పేలడంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగినప్పుడు కంపెనీలో పని చేస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News