Monday, January 27, 2025

ఆర్టీసి బస్సు- బైక్ ఢీ లెక్చరర్ మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కామారెడ్డి రూరల్ : కామారెడ్డి పట్టణ శివారులోని సిరిసిల్ల రోడ్డులో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసి బస్సు, బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…   రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన సంతోష్ రెడ్డి (45) కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌కె కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం సంతోష్ రెడ్డి విధులు ముగించుకొని స్వగ్రామానికి బైక్ పై వెళ్తుండగా పట్టణ శివారులోని సిరిసిల్ల రోడ్డులోని వాగు సమీపంలో ఆటోను ఓవర్‌టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. ఈ సంఘటనలో సంతోష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు కామారెడ్డి పట్టణ సిఐ నరేష్  సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి సమీక్షించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం సంతోష్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News