Monday, December 23, 2024

వడదెబ్బతో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ కామారెడ్డి : సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ శివారులో శనివారం వడదెబ్బతో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  గ్రామ శివారులోని స్మశాన వాటిక సమీపంలో కుళ్లిపోయిన శవం కనిపించినట్లు స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ శేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించి మృతుడు నిజామాబాద్ జిల్లా కంఠేశ్వర్ కు చెందిన అబ్దుల్ హమీద్ (45) గా గుర్తించారు. 15 సంవత్సరాల క్రితం హామీద్ కు నుంచి  భార్య  విడాకులు తీసుకోవడంతో అతడి మానసిక పరిస్థితి బాగోలేక మతిస్థిమితం కోల్పోయినట్లుగా ప్రవర్తిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారం రోజుల క్రితం ఇంటి నుంచి కామారెడ్డికు బయలుదేరి కాలినడకన తిరుగుతు అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో వడదెబ్బతో మరణించినట్లు ఎస్ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News