Tuesday, December 24, 2024

రైలు పట్టాలపై మళ్లీ గ్యాస్ సిలిండర్…తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

రూర్కీ: రైలు ప్రమాదాలను కల్పించే యత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ లోని రూర్కీ సమీపంలో రైల్వే ట్రాక్ పై ఎల్ పిజి సిలిండర్ కలకలం రేపింది. వెంటనే గూడ్స్ రైలు లోకో పైలట్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.

ఉత్తర రైల్వే సిపిఆర్వో అధికారి ప్రకారం లలాండౌర్-ధంధేరా స్టేషన్ల మధ్య ఉదయం 6.35 గంటలకు ఈ ఘటన వెలుగుచూసింది. సిలిండర్ ను దూరంగా తీసుకెళ్లి పరిశీలించినప్పుడు అది ఖాళీదని తేలింది. స్థానిక పోలీసులు, జిఆర్పీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. వరుస ఘటనల నేపథ్యంలో అనేక సందర్భాల్లో లోకో పైలట్లు అప్రమత్తం కావడం వల్లే ప్రమాదాలు తప్పాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News